NEWSNATIONAL

మాధ‌వీల‌త‌కు మోదీ కంగ్రాట్స్

Share it with your family & friends

మ‌హిళా సాధికార‌త‌కు ద‌ర్ప‌ణం

న్యూఢిల్లీ – ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా హైద‌రాబాద్ లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ త‌ర‌పున బ‌రిలో నిలిచిన విరించి ఆస్ప‌త్రి చైర్మ‌న్ కొంపెల్లి మాధ‌వీల‌త‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. జాతీయ ఛాన‌ల్ ఆజ్ త‌క్ లో ఆప్ కీ అదాల‌త్ లో మాధ‌వీల‌త మాట్లాడారు. ఈ సంద‌ర్బంగా ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చారు.

ప్ర‌ధాన మంత్రి ఈ దేశానికి ర‌క్ష‌కుడ‌ని, ఆయ‌న లేక పోతే దేశానికి భ‌విష్య‌త్తు అంటూ ఉండ‌ద‌న్నారు. మోదీ ఈ యుగ‌పు మ‌హా యోగి అని ప్ర‌శంస‌లు కురిపించారు మాధ‌వీల‌త‌. ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ ర‌జ‌త్ శ‌ర్మ అడిగిన ప‌లు క్లిష్ట‌మైన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు.

న‌న్ను ఎంపిక చేసిన విష‌యం గురించి కేవ‌లం ప్ర‌సార మాధ్య‌మాల ద్వారా మాత్ర‌మే తెలుసుకున్నాన‌ని చెప్పింది. నేను మోదీని క‌లుసు కోవ‌డం తాను అదృష్టంగా భావిస్తున్న‌ట్లు చెప్పారు. గ‌త 20 ఏళ్లుగా స్వచ్చంధ సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ వ‌చ్చాన‌ని తెలిపారు. ఓవైసీకి నేను స‌రైన పోటీ ఇవ్వ‌గ‌ల‌న‌ని భావించి మోదీ టికెట్ ఇచ్చారంటూ పేర్కొన్నారు. ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా ఎంద‌రికో సాయ ప‌డుతున్నాన‌ని అన్నారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి స్వ‌యంగా ఆమె వాగ్ధాటి గురించి ప్ర‌స్తావించారు..ప్ర‌సంస‌లు కురిపించారు. ప్ర‌తి ఒక్క‌రూ ఆమె ఇంట‌ర్వూను చూడాల‌ని కోరారు పీఎం.