పవన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్
అభినందించిన ప్రధాని మోదీ
అమరావతి – ఏపీలో జనసేన పార్టీ చీఫ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. రాష్ట్రంలో ఆక్టోపస్ లాగా విస్తరించింది వైసీపీ. సీఎం జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో కొలువు తీరిన వైసీపీ ప్రభుత్వాన్ని ఏకి పారేయడంలో, బలమైన జగన్ ను ఢీకొనడంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. ఒక రకంగా టీడీపీకి బలమైన శక్తిగా మారేందుకు కృషి చేశారు.
ఇదే సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసికట్టుగా పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన ప్రజా గళం సభను సక్సెస్ చేయడంతో అందరు నేతలు ఆనందంలో ఉన్నారు. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా సర్వే సంస్థలు, మీడియా కంపెనీలు పెద్ద ఎత్తున ముందస్తుగా ఫలితాలు ప్రకటించాయి.
ఇందులో విస్తు పోయేలా రిజల్ట్స్ ప్రకటించడంతో తెగ సంబరపడి పోతున్నాయి ఆయా పార్టీల శ్రేణులు. జనసేన కూటమి ఆధ్వర్యంలో భారీ ఎత్తున అసెంబ్లీ, ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశాయి. దీంతో మరింత హుషారులో ఉన్నారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్.