సుధా మూర్తికి మోదీ ప్రశంస
రాజ్యసభకు నామినేట్ అభినందనీయం
న్యూఢిల్లీ – ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధా మూర్తి పై ప్రశంసలు కురిపించారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. శుక్రవారం మోదీ నేతృత్వం లోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సుధా మూర్తిని రాజ్య సభకు నామినేట్ చేయాలని సూచించింది.
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకురాలిగా, సోషల్ ఇంజనీర్ గా , సామాజిక కార్యకర్తగా, రచయిత్రిగా గుర్తింపు పొందారు సుధా మూర్తి. ఆమెకు రాజ్యసభకు సిఫారసు చేయడం తాను గౌరవంగా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా ప్రధాన మంత్రి స్పందించారు. ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత రాష్ట్రపతి నామినేట్ చేసినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దాతృత్వంలో ఆదర్శ ప్రాయంగా నిలిచారంటూ కొనియాడారు సుధా మూర్తిని. అంతే కాకుండా సామాజిక సేవలు చేస్తూ స్పూర్తి దాయకంగా నిలిచారని ప్రశంసించారు. విద్యా పరంగా విభిన్న రంగాలలో చేయూత అందించారని పేర్కొన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
ఆమె రాజ్యసభలో ఉండడం మహిళా శక్తికి నిదర్శనమని పేర్కొన్నారు పీఎం.