ఎస్ఎం కృష్ణ మృతిపై పీఎం దిగ్భ్రాంతి
ఆత్మీయుడిని..ఆలోచనా పరుడిని కోల్పోయా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు . కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గొప్ప ఆలోచనాపరుడు, స్నేహశీలిని కోల్పోయానని వాపోయారు. జాతి గర్వించదగిన నాయకుడని కొనియాడారు. ఎస్ఎం కృష్ణ అన్ని వర్గాలను ప్రాణ ప్రదంగా ప్రేమించాడని పేర్కొన్నారు.
ప్రధానంగా దేశంలోనే బెంగళూరును ఐటీ రాజధానిగా మార్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేశాడని ప్రశంసించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇతరుల జీవితాలను అద్భుతంగా మార్చాలని కలలు కన్నాడని, వాటిని ఆచరణలో చేసి చూపించిన అరుదైన నేత అంటూ పేర్కొన్నారు. ఆయన లేని లోటు పూడ్చ లేనిదని అన్నారు.
కర్ణాటక సీఎంగా ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారని, ప్రత్యేకించి ఆయన పదవీ కాలంలో మౌలిక సదుపాయాల కల్పనకు, అభివృద్దికి పాటు పడ్డారని తెలిపారు నరేంద్ర మోడీ. ఒక రకంగా కర్ణాటకకే కాదు తనకు తీరని లోటు అని వాపోయారు. దేశం ఉన్నంత కాలం ఎస్ఎం కృష్ణ బతికే ఉంటారని పేర్కొన్నారు.