గెలుపే లక్ష్యంగా ప్రచారం
న్యూఢిల్లీ – కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేయడంతో ముందస్తుగానే ఎన్నికల కదన రంగంలోకి ఎంటర్ అయ్యారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. తాను పీఎంగా కొలువు తీరి ముచ్చటగా 10 ఏళ్లు పూర్తవుతోంది. ఈసారి కూడా తాను మూడోసారి ప్రధాని కావాలని కంకణం కట్టుకున్నారు. ఆ దిశగా పావులు కదుపుతున్నారు.
ఇందు కోసం భారతీయ జనతా పార్టీ, దాని అనుబంధ సంస్థలైన ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ, భజరంగ్ దళ్ , ఏబీవీపీ , ధర్మ ప్రచార పరిషత్ లను అలర్ట్ చేశారు. చాప కింద నీరులా ప్రచారాన్ని ప్రారంభించారు. 143 కోట్ల మంది భారతీయులను కేవలం మతం పేరుతో ప్రభావితం చేసి , కులం పేరుతో , విద్వేషాల పేరుతో విడగొట్టి ఓట్లు పొందాలనేది ప్లాన్ అంటూ ఏఐసీసీ చీఫ్ ఖర్గే సంచలన ఆరోపణలు చేశారు.
ఇండియా కూటమిని నిర్వీర్యం చేసి, మరోసారి ఎర్రకోటపై కాషాయ జెండా ఎగర వేయాలని అన్నదే తన అంతిమ ఆశయమని ఇప్పటికే ప్రకటించారు బీజేపీ రథ సారథి నరేంద్ర దామోదర దాస్ మోదీ. ఆయన కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారు. కానీ ఒక్కరిని మాత్రం కంట్రోల్ చేయలేక పోతున్నారు. అతడు ఎవరో కాదు కరుడు గట్టిన నిజాయితీ కలిగిన న్యాయమూర్తి , సీజేఐ జస్టిస్ చంద్రచూడ్..
మొత్తం మీద 545 సీట్లకు గాను 400 సీట్లకు పైగా రావాలని దిశా నిర్దేశం చేశారు ప్రధాని మోదీ. ఆ దిశగా దూకుడు పెంచారు.