NEWSNATIONAL

మైక్రోసాఫ్ట్ అంత‌రాయంపై మోడీ ఆరా

Share it with your family & friends

మైక్రోసాఫ్ట్ తో స‌ర్కార్ సంప్ర‌దింపులు

న్యూఢిల్లీ – ప్ర‌పంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ లో చోటు చేసుకున్న సాంకేతిక లోపం కార‌ణంగా భారీ ఎత్తున కార్య‌క‌లాపాలు నిలిచి పోయాయి. ఆ ప్ర‌భావం భార‌త దేశంపై ఎక్కువ‌గా ప‌డింది. నిత్యం కార్య‌క‌లాపాలు సాగిస్తున్న మాల్స్, సూప‌ర్ మార్కెట్లు, ఎయిర్ పోర్టులు, బ్యాంకులు, ట్రేడింగ్ కంపెనీలు..ఇలా ప్ర‌తి ఒక్కటికి తీవ్ర ఇబ్బంది ఏర్ప‌డింది.

దీంతో రంగంలోకి దిగారు దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ. శుక్ర‌వారం ఆయ‌న జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఎవ‌రూ కూడా ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. గ్లోబ‌ర్ సైబ‌ర్ అంత‌రాయంపై ఆరా తీశామ‌ని చెప్పారు.

ఈ అంత‌రాయానికి గ‌ల కార‌ణాలు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని తెలిపారు పీఎం. నిశితంగా గ‌మ‌నిస్తున్నామ‌ని చెప్పారు. భారతీయులు ఎవ‌రూ ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా చూడాలని ప్రధాని మోదీ కోరారు.

విమానాలు, సూపర్ మార్కెట్లు, బ్యాంకింగ్ కార్యకలాపాలు, స్టాక్ మార్కెట్ , ప్రపంచంలోని బహుళ రంగాలకు అంతరాయం కలిగించిన ప్రపంచ వ్యాప్త అంతరాయాన్ని పరిష్కరించడానికి భారత ప్రభుత్వం మైక్రోసాఫ్ట్‌తో సంప్రదింపులు జరుపుతోందని స్ప‌ష్టం చేశారు .