NEWSINTERNATIONAL

భార‌త దేశం శాంతి ప‌క్షం – మోడీ

Share it with your family & friends

ఉక్రెయిన్ చీఫ్ కు ప్ర‌ధాన‌మంత్రి భ‌రోసా

ఉక్రెయిన్ – భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశం యుద్దాన్ని ఎప్పుడూ కోరుకోద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌పంచంలోని ప్ర‌తి దేశం బాగుండాల‌ని కోరుకుంటుంద‌ని తెలిపారు. విదేశీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప్ర‌ధానమంత్రి పోలండ్ తో పాటు ఉక్రెయిన్ ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా యుద్దం కార‌ణంగా ఉక్రెయిన్ ఎలా విధ్వంసానికి గురైందో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించారు ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ.

ఈ సంద‌ర్బంగా జెలెన్ స్కీ భుజంపై చేయి వేస్తూ ముందుకు న‌డించారు. ఆయ‌న‌కు తాను ఉన్నానంటూ మోడీ భ‌రోసా క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశారు. అంత‌కు ముందు ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేర‌కు ర‌ష్యాను సంద‌ర్శించారు. ఇదే స‌మ‌యంలో ఉక్రెయిన్ పై దాడిని ఆపాల‌ని మోడీ కోరారు.

అమెరికా ప్ర‌భుత్వం సైతం ఉక్రెయిన్ , ర‌ష్యా అధినేత‌ల మ‌ధ్య స‌యోధ్య కుదిర్చేందుకు, శాంతి నెల‌కొల్పేందుకు ప్ర‌ధాన మంత్రి చొర‌వ తీసుకోవాల‌ని కోరారు. దీనిపై భార‌త్ స్పందించింది. తాము ఎవ‌రి ప‌క్షం వ‌హించ‌మ‌ని, కానీ ప్ర‌తి ఒక్క‌రు బాగుండాల‌ని తాము కోరుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు న‌రేంద్ర దామోద‌ర దాస్ మోడీ.

ఇదిలా ఉండ‌గా ఉక్రెయిన్ కు వైద్య ప‌రంగా కావాల్సినంత స‌హాయం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు ప్ర‌ధాన‌మంత్రి.