ప్రధాని మోడీ నివాసంలోకి ‘దీప్జ్యోతి’
7 లోక్ కళ్యాణ్ మార్గ్ లో హల్ చల్
న్యూఢిల్లీ – దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆయన ఏది చేసినా ఓ సంచలనమే. శనివారం అరుదైన ఫోటోలను, వీడియోను పంచుకున్నారు స్వయంగా నరేంద్ర మోడీ.
సామాజిక మాధ్యమం ట్విట్టర్ ఎక్స్ వేదికగా తన ఇంటికి కొత్త సభ్యుడు వచ్చారంటూ పేర్కొన్నారు నరేంద్ర దామోదర దాస్ మోడీ.
సదరు సభ్యుడికి కొత్తగా పేరు కూడా పెట్టానని ప్రధానమంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి నెట్టింట్లో.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన అధికారిక నివాసంలో కొత్త సభ్యుడు లోక్ కళ్యాణ్ మార్గ్ (LKM) లోకి వచ్చారంటూ , దాని పేరు ‘దీప్జ్యోతి’ అని పెట్టినట్లు తెలిపారు స్వయంగా.
‘దీప్జ్యోతి’ ఇటీవలే ప్రధాని నివాసంలో పుట్టిన దూడ. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీ తన సోషల్ మీడియా హ్యాండిల్లో పంచుకోవడం విశేషం.
వీడియోలో, ప్రధాని మోదీ మా భగవతితో పాటు ఆమెను పూజించడాన్ని చూడవచ్చు. అతను కొత్తగా పుట్టిన దూడను కౌగిలించు కోవడం తో పాటు పచ్చని తోటలలో చిన్న నడక కోసం ‘దీప్జ్యోతి’ని తీసుకువెళ్లడం కూడా చూడవచ్చు.