నేత్ర దానం గొప్పది – మోడీ
వారణాసిలో ఆస్పత్రి ప్రారంభం
ఉత్తర ప్రదేశ్ – అన్ని దానాలలో నేత్ర దానం గొప్పదని అన్నారు భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ. ఆదివారం యూపీలోని వారణాసిలో అత్యాధునిక వసతులతో నిర్మించిన కంటి ఆస్పత్రిని ప్రారంభించారు. అంతకు ముందు కంచి స్వామీజీని కలుసుకున్నారు. ఆయన ఆశీర్వాదం పొందారు.
అనంతరం పలు అభివృద్ది పనులకు శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం యోగి ఆదిత్యానాథ్ తో కలిసి పాల్గొన్నారు. ఎయిర్ పోర్ట్ రన్ వే విస్తరణ, కొత్త టెర్మినల్ భవన నిర్మాణం, లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో రూ. 2,870 కోట్లతో నిర్మించే ఇతర పనులకు శంకుస్థాపన చేశారు.
ఇదిలా ఉండగా ప్రధాన మంత్రి వారణాసి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. తను పూర్తిగా దీనిపై ఫోకస్ పెట్టారు. వారణాసి పర్యటనలో ఉన్న ఆయన ఆర్జే శంకర కంటి ఆస్పత్రిని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. రూ. 6,100 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టారు.
కంచి శంకరాచార్యతో కలవడం మరింత సంతోషాన్ని కలిగించిందని చెప్పారు ఈ సందర్బంగా మోడీ. ఇక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను తిలకించారు. గవర్నర్ ఆనంది పటేల్ కూడా పీఎం వెంట ఉన్నారు.