25 ప్రపంచ పార్టీలకు ఆహ్వానం
ఎన్నికల వేళ పర్యవేక్షణకు రండి
న్యూఢిల్లీ – భారత దేశంలో ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం లేదని ప్రతిపక్షాలు పదే పదే ఆరోపణలు చేస్తుండడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన ప్రధాన పార్టీలకు చెందిన ప్రతినిధులు తమ దేశానికి రావాలని పిలుపునిచ్చారు.
ఈ మేరకు భారత దేశ ప్రభుత్వం తరపున ప్రధాన మంత్రి ప్రత్యేకంగా ఆహ్వానం పంపారు. వరల్డ్ వైడ్ గా మొత్తం 25 పార్టీలకు రావాలంటూ కోరారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్ష పాతంగా జరుగుతాయో లేదో స్వయంగా పర్యవేక్షించేందుకు తాము ఆహ్వానం పలుకుతున్నామని పేర్కొన్నారు మోదీ.
ఇదిలా ఉండగా ఆహ్వానం అందుకున్న పార్టీలలో ప్రధానంగా యునైటెడ్ కింగ్ డమ్ లోని కన్జర్వేటివ్ , లేబర్ పార్టీలతో పాటు క్రిష్టియన్ డెమోక్రేట్ , జర్మనీకి చెందిన సోషల్ డెమోక్రాట్ లు ఉన్నాయి. అంతే కాకుండా బంగ్లాదేశ్ కు చెందిన షేక్ హసీనా అవామీ లీగ్ కి కూడా ఇన్విటేషన్ పంపించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.