ప్రధానమంత్రి మోడీ వైరల్
జి7 సదస్సులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్
ఇటలీ – భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిజీగా ఉన్నారు. ఆయన ముచ్చటగా మూడోసారి దేశ ప్రధానిగా ఆశీసులయ్యారు. పీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి విదేశీ పర్యటన చేపట్టారు. ఆయన నేరుగా ఇటలీకి వెళ్లారు. అక్కడ జరుగుతున్న జి7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఆయా దేశాధినేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా కీలక చర్చలు జరిగాయి.
నరేంద్ర మోడీకి ఇటలీ దేశాధ్యక్షురాలు మెలీనా గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు పోటీ పడ్డారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇదిలా ఉండగా కీలక వ్యాఖ్యలు చేశారు నరేంద్ర మోడీ. జి7ను ఉద్దేశించి ప్రసంగంచారు. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న సాంకేతిక పరిణామాలను అంది పుచ్చు కోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు యావత్ దేశాలన్నీ దీనిని స్వీకరించేందుకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి.