మోదీ రోడ్ షోకు భారీ స్పందన
జబల్ పూర్ ను మరిచి పోలేను
జబల్ పూర్ – పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో మరోసారి పవర్ లోకి రావాలని కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా పీఎం విస్తృతంగా పర్యటిస్తున్నారు. రోడ్ షోలు, సమావేశాలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి ఇండియా కూటమిని ఏకి పారేస్తున్నారు. తాను అభివృద్ది మంత్రం జపిస్తే వారంతా ద్వేషాన్ని ముందుకు తీసుకు వస్తున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు.
తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్బంగా జబల్ పూర్ లో జరిగిన భారీ రోడ్ షోకు జనం అశేష వాహినిగా తరలి వచ్చారు. తమ నాయకుడిని చూసేందుక ఉత్సుకత చూపించారు. వందలాది మంది యువత ప్రధానమంత్రి మోదీతో సెల్ఫీ తీసుకునేందుకు పోటీ పడ్డారు.
ఈ సందర్బంగా నరేంద్ర మోదీ ప్రత్యేకంగా జబల్ పూర్ రోడ్ షోను ప్రస్తావించారు. తన పట్ల అద్భుతమైన ఆదరణను కనబర్చి, సహకరించినందుకు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని జోష్యం చెప్పారు తమ పార్టీకి కనీసం 400 సీట్లకు పైగానే వస్తాయని పేర్కొన్నారు.