ఆయన ఉన్నతమైన పండితుడు
ఢిల్లీ – భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ బిబేక్ దేబ్రోయ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన అద్భుతమైన పండితుడు అని పేర్కొన్నారు. ఆర్థిక శాస్త్రం, చరిత్ర, సంస్కృతి, రాజకీయాలు, ఆధ్యాత్మికత, మరిన్ని వంటి విభిన్న రంగాలలో బాగా ప్రావీణ్యం కలిగి ఉన్నారని ప్రశంసలు కురిపించారు ప్రధానమంత్రి.
తన రచనల ద్వారా, అతను భారతదేశ మేధో ఉన్నత దృశ్యంలో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ప్రజా విధానానికి ఆయన చేసిన కృషికి అతీతంగా, మన ప్రాచీన గ్రంథాలపై పని చేయడంలో ఆనందాన్ని పొందాడని పేర్కొన్నారు. వాటిని యువతకు అందుబాటులో తీసుకు వచ్చేలా ప్రయత్నం చేశాడని తెలిపారు నరేంద్ర మోడీ.
బిబేక్ దేబ్రోయ్ లేక పోవడం బాధాకరమని తెలిపారు. ఈ సందర్బంగా దీపావళి పండుగ సందర్బంగా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ శుబాకాంక్షలు తెలిపారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.