సహకారంతోనే సుపరిపాలన సాధ్యం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కామెంట్
ఢిల్లీ – పరస్పర సహకారంతోనే సుపరిపాలన సాధ్యమవుతుందని స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్ సంబంధాలు ఉండాలన్నారు. లేక పోతే పాలనా పరంగా ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందన్నారు . చర్చలు వృద్దిని మరింత పెంచడం, సమర్థవంతమైన పాలనను నిర్ధారించడం, పౌరులకు మెరుగైన సేవలు అందించడంపై ఫోకస్ పెట్టాలన్నారు పీఎం.
మెరుగైన పాలన కోసం మౌలిక సదుపాయాలను ఇతర సాంకేతికతను ఎలా పెంచుకోవాలనే దానిపై కూడా తాము దృష్టి సారించడం జరిగిందని చెప్పారు నరేంద్ర మోడీ. సమాచారం కీలకమైన పాత్ర పోషిస్తుందని ఎప్పటికప్పుడు ఇచ్చి పుచ్చుకోవాలని సూచించారు.
నాణేనికి రెండు వైపులా కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాలు ఉంటాయని, ఆ విషయాన్ని గుర్తెరిగి ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు నరేంద్ర మోడీ. వ్యవస్థలు మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వీటిపైనే ఎక్కువగా దృష్టి సారించాలని పేర్కొన్నారు.
సహకారం వల్ల క్లిష్టతరమైన సమస్యలు, పనులు త్వరితగతిన పూర్తయ్యేందుకు దోహద పడుతుందని చెప్పారు నరేంద్ర దామోదర దాస్ మోడీ.