NEWSNATIONAL

నా దేశం అంటే ఢిల్లీ కాదు – మోదీ

Share it with your family & friends

నిప్పులు చెరిగిన ప్ర‌ధాన‌మంత్రి

న్యూఢిల్లీ – ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశం అంటే ఒక్క ఢిల్లీ మాత్ర‌మే కాద‌న్నారు. చెన్నై, బెంగ‌ళూరు, హైద‌రాబాద్ , ముంబై , ల‌క్నో , కోల్ క‌తా కూడా ఉంద‌న్న సంగ‌తి తెలుసు కోవాల‌న్నారు. ఇండియా ఒక్క‌టే ఢిల్లీ అనే భ్ర‌మ గ‌తంలో ఉండేద‌న్నారు ప్ర‌ధాని. కానీ దానిని తుడిచి వేశామ‌న్నారు పీఎం.

దేశం అభివృద్ది చెందిన‌ప్పుడే రాష్ట్రాలు కూడా అభివృద్ది చెందుతాయ‌ని అన్నారు. ఇందులో భాగంగా ఇదే స‌మ‌యంలో రాష్ట్రాలు కూడా ఓ అడుగు ముందుకు వేస్తే తాము రెండు అడుగులు వేస్తాన‌ని చెప్పారు న‌రేంద్ర మోదీ.

దేశంలోని అన్ని ప్రాంతాలు త‌న‌కు స‌మాన‌మ‌ని అన్నారు. కొంద‌రు తనపై లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని, ప్ర‌ధానంగా ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల్లో వాస్త‌వం లేద‌న్నారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

ఢిల్లీలో త‌మ‌కు అన్యాయం జ‌రిగిందంటూ క‌ర్ణాట‌క కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న చేప‌ట్ట‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఏ రాష్ట్రంపై తాము క‌క్ష సాధింపు ధోర‌ణి అవ‌లంభించ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు న‌రేంద్ర మోదీ.