NEWSNATIONAL

2047 గురించి ఆలోచిస్తున్నా

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన ప్ర‌ధాన‌మంత్రి
న్యూఢిల్లీ – తాను ప్ర‌స్తుతం ఈ ఏడాది 2024లో జ‌ర‌గ‌బోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల గురించి ఆలోచించ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. రాబోయే 2047వ సంవ‌త్స‌రం గురించి ప్లాన్ చేస్తున్నాన‌ని అన్నారు. ప్ర‌ముఖ జాతీయ మీడియా సంస్థ ఏఎన్ఐ ఎగ్జిక్యూటివ్ ఎడిట‌ర్ స్మితా ప్ర‌కాశ్ తో ప్ర‌ధాన‌మంత్రి సంభాషించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న అనేక అంశాల గురించి త‌న అభిప్రాయాలను కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. ఎందుకంటే దేశంలోని 143 కోట్ల మంది భార‌తీయులంతా ముక్త కంఠంతో తానే ప్ర‌ధాన‌మంత్రి కావాల‌ని కోరుకుంటున్నార‌ని, ఇది జాతీయ సంస్థ‌లు జ‌రిపిన స‌ర్వేల‌లో , గ‌ణాంకాల‌లో స్ప‌ష్ట‌మైంద‌ని అన్నారు మోదీ.

తాను పీఎంగా కొలువు తీరిన వెంట‌నే 100 రోజుల ప్ర‌ణాళిక‌ను సిద్దం చేస్తున్న‌ట్లు చెప్పారు. ఎవ‌రూ భ‌య‌ప‌డాల్సిన ప‌ని లేద‌న్నారు. తాను తీసుకోబోయే నిర్ణ‌యాలు దేశ స‌ర్వ‌తోముఖాభివృద్దికి సంబంధించిన‌వే అయి ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ.