ఒడిశా సీఎంతో విభేదాలు లేవు
స్పష్టం చేసిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ – భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల సందర్బంగా ఆయన జాతీయ మీడియా ఏఎన్ఐ చీఫ్ కరెస్పాండెంట్ తో సంభాషించారు. ఈ సందర్బంగా తనకు వ్యక్తిగతంగా ఎవరితో శత్రుత్వం లేదని స్పష్టం చేశారు. బయట జరుగుతున్న ప్రచారం అంతా అబద్దమని కొట్టి పారేశారు.
తాను అందరినీ ఒకే లాగా చూస్తానని చెప్పారు. ఈ మధ్యన తనకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కు మధ్య విభేదాలు వచ్చాయని జరుగుతున్న ప్రచారాన్ని కొట్టి పారేశారు నరేంద్ర మోడీ. ఇదంతా కావాలని ప్రతిపక్షాలు చేస్తున్న నాటకమంటూ మండిపడ్డారు.
భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ప్రజాస్వామ్యంలో తమకు ఎలాంటి శత్రుత్వం లేదన్నారు. అయితే ఎన్నికలు వేరు రాజకీయాలు వేరు. దేనినైనా రాజకీయ పరంగానే చూడాలి తప్పా వ్యక్తిగతంగా ఆపాదించ కూడదని అన్నారు నరేంద్ర మోడీ.