ఓటు వజ్రాయుధం – పీఎం
ప్రతి ఒక్కరు ఓటు వేయాలి
న్యూఢిల్లీ – సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఓటు వేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని లేక పోతే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదన్నారు. ఓటు అన్నది వజ్రాయుధమని పేర్కొన్నారు. దీనిని ప్రతి ఒక్కరికీ ఓటు వేయాల్సిన బాధ్యత ఉందని మోదీ గుర్తు చేశారు.
ప్రపంచంలోనే భారత దేశం అత్యంత అతి పెద్ద ప్రజాస్వామిక దేశమని తెలిపారు. ఇవాళ గతంలో ఎన్నడూ లేని రీతిలో తన హయాంలో ప్రపంచంలోని 23 దేశాలకు చెందిన ప్రతినిధుల బృందం దేశాన్ని సందర్శించిందని పేర్కొన్నారు మోదీ.
దీనికి కారణం వారంతా దేశంలో ఎన్నికలు సక్రమంగా జరుగుతున్నాయో లేదోనని పరిశీలిస్తారని చెప్పారు. తాము ఏ దేశానికి చెందిన వారైనా ఇక్కడికి రావాలని పిలుపు ఇచ్చామన్నారు. తాను ప్రత్యేకంగా ఆహ్వానం పలికానని తెలిపారు నరేంద్ర మోదీ.
తన జీవితంలో ఏనాడూ ఓటు వేయకుండా ఉండలేదన్నారు. దీనికి కారణం మన ఓటు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు .