NEWSNATIONAL

గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్ నివార‌ణే ల‌క్ష్యం

Share it with your family & friends

బిల్ గేట్స్ తో ప్ర‌ధాన‌మంత్రి మోదీ

న్యూఢిల్లీ – ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. శుక్ర‌వారం బిల్ గేట్స్ తో ముచ్చ‌టించారు పీఎం. ఈ సంద‌ర్బంగా ఇద్ద‌రి మ‌ధ్య వివిధ అంశాల‌పై చ‌ర్చించారు. ప్ర‌ధానంగా త‌న ముందున్న ల‌క్ష్యం మ‌హిళ‌ల సంక్షేమ‌మ‌ని స్ప‌ష్టం చేశారు మోదీ.

ఇందులో భాగంగా ఈ దేశంలో చాలా మంది మ‌హిళ‌లు గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్ ను ఎదుర్కొంటున్నార‌ని, వారిని ర‌క్షించ‌డ‌మే త‌న ముందున్న టార్గెట్ అని ప్ర‌క‌టించారు. ఇందు కోసం వ్యాక్సినేష‌న్ల‌ను త‌యారు చేసే ప‌నిలో ప‌డ్డామ‌న్నారు. చాలా ఫార్మా కంపెనీలు వీటిపై దృష్టి సారించాయ‌ని తెలిపారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌లో విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. ఇదే స‌మ‌యంలో విద్య‌, వైద్యం, ఉపాధి , స్టార్ట‌ప్ ఇండియా, ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు, డిజిట‌లైజేష‌న్ , టెక్నాల‌జీ , అంత‌రిక్ష‌యానం పై తాము దృష్టి సారించామ‌ని చెప్పారు ప్ర‌ధాన‌మంత్రి.

దేశ వ్యాప్తంగా కోట్లాది మంది మ‌హిళ‌ల‌లో గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్ ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ప్ర‌చారం చేప‌డ‌తామ‌ని స్ప‌ష్టం చేశారు న‌రేంద్ర మోదీ.