గయానాలో మోడీకి ఘన స్వాగతం
జీ 20 సదస్సు అనంతరం పర్యటన
గయనా – బ్రెజిల్ లోని రియో డి జెనీరోలో జరిగిన కీలకమైన జి20 శిఖరాగ్ర సదస్సు ముగిసింది. ఈ సదస్సులో ప్రధాన ఆకర్షణగా నిలిచారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సదస్సు అనంతరం ప్రధాని నేరుగా కొద్ది సేపటి క్రితం గయానాకు చేరుకున్నారు.
ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీకి ఘన స్వాగతం లభించింది. స్వయంగా ఆయనకు స్వాగతం పలికేందుకు విచ్చేశారు దేశ అధ్యక్షుడు డాక్టర్ ఇర్ఫాన్ అలీ, ప్రధానమంత్రి మార్క్ ఆంథోనీ ఫిలిప్స్. వీరితో పాటు సీనియర్ మంత్రులు, ఇతర ప్రముఖులు సాదర స్వాగతం పలికారు.
తనకు వెల్ కమ్ చెప్పినందుకు గాను దేశ అధ్యక్షుడు, ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు ప్రధానమంత్రితో పాటు దేశ విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రమణ్యం జై శంకర్. ఈ పర్యటన భారత దేశం, గయానా దేశాల మధ్య మరింత స్నేహాన్ని పెంచుతుందని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు నరేంద్ర మోడీ.
భారత దేశం ఇతర దేశాలతో స్నేహ పూర్వకంగా ఉంటుందని స్పష్టం చేశారు. శాంతి కోసం నిరంతరాయంగా ప్రయత్నం చేస్తుందన్నారు ప్రధానమంత్రి.