ఆధ్యాత్మిక అభ్యున్నతి గొప్పది
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ఉత్తర ప్రదేశ్ – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యూపీలో శ్రీ కల్కి ధామ్ ఆలయ నిర్మాణానికి సోమవారం శంకు స్థాపన చేశారు. ఈ సందర్బంగా పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యానాథ్ తో పాటు ఆచార్య ప్రమోద్ కృష్ణం జీ హాజర్యారు.
పూజలు చేసిన అనంతరం ప్రధాన మంత్రి మాట్లాడారు. ఈ దేశంలో ఆధ్యాత్మికత పరవళ్లు తొక్కుతోందన్నారు. దైవం పట్ల ప్రతి ఒక్కరు ఎరుక కలిగి ఉండాలన్నారు. జీవితంలో దేనినైనా సాధించాలన్నా ముందు ధ్యానం అత్యంత అవసరమని పేర్కొన్నారు మోదీ.
తన జీవితంలో ఈ రోజును మరిచి పోలేనని పేర్కొన్నారు ప్రధాన మంత్రి. తాను కలలో కూడా అనుకోలేదన్నారు మోదీ. కల్కి ధామ్ ఆలయానికి శంకు స్థాపన చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.
ఆధ్యాత్మిక అభ్యున్నతి , సమాజ సేవ కోసం ఆచార్య ప్రమోద్ కృష్ణం జీ చేస్తున్న కృషి గురించి ఎంత చెప్పినా తక్కువేనని స్పష్టం చేశారు నరేంద్ర దామోదర దాస్ మోదీ. ఇదే ఏడాదిలో యూపీలో శ్రీరాముడి పునః ప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టడం కూడా అద్వితీయమైనదని తెలిపారు.