NEWSNATIONAL

కెన‌డా పీఎంకు మోడీ మాస్ట‌ర్ స్ట్రోక్

Share it with your family & friends

తీవ్ర‌వాదుల జాబితా విడుద‌ల

ర‌ష్యా – కాదు కూడ‌దంటూ భార‌త దేశంతో క‌య్యానికి కాలు దువ్వుతున్న కెన‌డా దేశ ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూడో కు బిగ్ షాక్ ఇచ్చారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ. ప్ర‌స్తుతం ఆయ‌న ర‌ష్యా లోని క‌జాన్ లో జ‌రుగుతున్న బ్రిక్స్ స‌ద‌స్సులో పాల్గొన్నారు. కీల‌క‌మైన వ్యాఖ్య‌లు చేశారు. మ‌రో వైపు నిన్న‌టి దాకా దుందుడుకు ధోర‌ణి ప్ర‌ద‌ర్శించిన చైనా సైతం భార‌త్ తో స‌త్ సంబంధాల‌ను నెల‌కొల్పుకునేందుకు ముందుకు వ‌చ్చింది.

ఈ మేర‌కు భార‌త్, ర‌ష్యా, చైనా దేశాల అధిప‌తులు మూకుమ్మ‌డిగా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. దీంతో నిన్న‌టి దాకా త‌మ‌కు ఎదురే లేద‌ని భావిస్తూ వ‌చ్చిన అమెరికా దేశానికి కంటి మీద కునుకు లేకుండా చేశారు ప్ర‌ధాన‌మంత్రి మోడీ. ఇదే స‌మ‌యంలో కెన‌డా పీఎంకు బేష‌ర‌తు మ‌ద్ద‌తు ఇస్తున్న యుఎస్ కు స్ట్రాంగ్ స్ట్రోక్ ఇచ్చారు.

అంతే కాకుండా కెన‌డాను , పీఎం కుటిల నీతిని బ‌హిర్గ‌తం చేసేలా ఏకంగా తీవ్ర‌వాదుల జాబితాల‌ను వెల్ల‌డించారు ప్ర‌ధాన‌మంత్రి. కెన‌డా దేశంలో సుర‌క్షితంగా ఉంటూ భార‌త దేశానికి వ్య‌తిరేకంగా కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హిస్తున్న ఖలిస్తానీ టెర్ర‌రిస్టుల లిస్టు ఇదిగో అంటూ బ్రిక్స్ లో ప్ర‌క‌టించింది.

ఈ జాబితాను ఆస్ట్రేలియా, కెన‌డా, న్యూజిలాండ్, యుకెత ఓపాటు యుఎస్ కూడా ఉన్నాయి. ఓ వైపు ట్రూడో కు రోజు రోజుకు మ‌ద్ద‌తు స‌న్న‌గిల్లుతోంది. ఇంకో వైపు ఏం చేయాలో తోచ‌క త‌ల్ల‌డిల్తుతున్నారు.