కన్యాకుమారిలో మోడీ ధ్యానం
24 గంటల పాటు మౌనంగానే పీఎం
న్యూఢిల్లీ – భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ప్రతి క్షణం ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ప్రపంచంలో మోస్ట్ పాపులర్ కలిగిన నాయకుడిగా, పీఎంగా గుర్తింపు పొందారు. ప్రధానంగా ఆయన సోషల్ మీడియాను వాడు కోవడంలో టాప్ లో కొనసాగుతున్నారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. జూన్ 1న చివరగా 7వ విడత పోలింగ్ కొనసాగనుంది. ఇప్పటి వరకు దేశమంతటా ప్రచారం చేయడంలో అందరికంటే ముందంజలో ఉన్నారు. ప్రతిపక్షాలతో కూడిన భారత కూటమిని ఏకి పారేశారు.
ఇదిలా ఉండగా 545 సీట్లకు గాను 543 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా 50 రోజులకు పైగా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేపట్టారు. ప్రధానమవత్రి మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన స్వామి వివేకానందుడు ధ్యానం చేసిన ప్రదేశం కన్యాకుమారిలో ధ్యానం చేయనున్నారు. ఈ ప్రక్రియ కనీసం 24 గంటల పాటు కొనసాగనుంది.
అయితే 2019లో జరిగిన ఎన్నికల అనంతరం ఉత్తరాఖండ్ లో గడిపాడు.