ఇరాన్ అధ్యక్షుడితో మోడీ భేటీ
కీలక అంశాలపై చర్చలు
రష్యా – భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ కీలకంగా మారారు. రష్యాలోని కజాన్ లో కీలకమైన బ్రిక్స్ 2024 సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో కీలకమైన అంశాలపై చర్చిస్తున్నారు. మొత్తంగా ఈ సదస్సులో హైలెట్ గా మారారు మన మోడీ. ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రత్యేక ఆహ్వానం మేరకు పాల్గొన్నారు. ప్రధానంగా ఉగ్రవాదం, ఇతర కీలక సమస్యలపై చర్చించారు.
మరో వైపు ఇజ్రాయల్, ఇరాన్ దేశాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరుకుంది. ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఈ తరుణంలో సరిహద్దు సమస్యతో కొట్టుమిట్టాడుతోంది చైనా. కావాలని భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతోంది.
ఇక మోడీకి చిరకాల మిత్రుడైన రష్యా చీఫ్ వ్లాదిమీర్ పుతిన్ పూర్తిగా మద్దతు ప్రకటించారు భారత దేశానికి. ఆయన అనువాదకులను పెట్టుకోకుండానే మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ సందర్బంగా మోడీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తను ఏం మాట్లాడుతున్నాననేది మోడీ గ్రహించగలరని పేర్కొన్నారు. ఇదే సమయంలో భారత్, చైనా దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నం చేశారు. ఇందులో సక్సెస్ అయ్యారు.
ఈ సందర్బంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య పూర్తి స్థాయి సంబంధాలను సమీక్షించడం జరిగిందని తెలిపారు మోడీ. తాము భవిష్యత్ రంగాలలో సంబంధాలను మరింతగా పెంచుకునే మార్గాలను కూడా చర్చించడం జరిగిందన్నారు.