కీలక అంశాలపై చర్చలు
బ్రెజిల్ – బ్రెజిల్ లోని రియో డి జెనీరో వేదికగా కీలకమైన జి 20 ప్రపంచ సదస్సు జరుగుతోంది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ సుబ్రమణ్యం జై శంకర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమెరికా దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్, సౌత్ కొరియా చీఫ్ , ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ములాఖత్ అయ్యారు మోడీ.
ప్రధాన మంత్రి జార్జియా మెలోనిని కలుసుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు ప్రధానమంత్రి తమ చర్చలు రక్షణ, భద్రత, వాణిజ్యం , సాంకేతికతలో సంబంధాలను మరింతగా పెంచు కోవడంపై కేంద్రీకృతమై ఉన్నాయని పేర్కొన్నారు.
సంస్కృతి, విద్య, ఇతర రంగాలలో సహకారాన్ని ఎలా పెంచుకోవాలో కూడా తాము మాట్లాడటం జరిగిందన్నారు నరేంద్ర దామోదర దాస్ మోడీ. ఇదిలా ఉండగా అత్యంత కీలకంగా మారింది భారత్, చైనా దేశాల మధ్యం బంధం. ఇటీవల రష్యా వేదికగా జరిగిన సమావేశంలో ఇరు దేశాధినేతలు మోడీ, జిన్ పింగ్ ల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఆయన మోడీతో చిరకాల స్నేహం ఉంది. ప్రస్తుతం చైనా, రష్యా, భారత్ దేశాలు ఒక్కటి కావడాన్ని అమెరికా జీర్ణించు కోలేక పోతోంది.
ఇరు దేశాధినేతలు కీలకమైన సమావేశంలో చర్చించిన తర్వాత ఒక ఒప్పందానికి వచ్చారు. దీంతో ప్రస్తుతం రియో డి జెనోరీ వేదికగా జరుగుతున్న సదస్సులో భారత్, చైనా దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు భేటీ కావడంపై ఉత్కంఠ నెలకొంది. ఇందుకు సంబంధించి ఎక్స్ వేదికగా సమావేశమైన విషయాన్ని స్వయంగా పంచుకున్నారు డాక్టర్ సుబ్రమణ్యం జై శంకర్.
ఇదిలా ఉండగా జి20 శిఖరాగ్ర సమావేశానికి ముందు ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మధ్య కుదిరిన ముఖ్యమైన ఉమ్మడి అవగాహనలను అందించడానికి సిద్ధంగా ఉన్నామని చైనా తెలిపింది. ఇటీవల కజాన్‌లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు’ అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ మీడియా సమావేశంలో వెల్లడించారు.