జైనాచార్య ఆశీర్వాదం మోడీ సంతోషం
భారత దేశం మహానుభావులకు పుట్టినిల్లు
ఢిల్లీ – భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ప్రముఖ జైనాచార్యుడిని కలుసుకున్నారు. ధూలేకు చేరుకున్న పీఎం జైనాచార్య రత్న సుందర్సూరీశ్వర్జీ మహరాజ్ సాహెబ్‌ను కలిశారు. ఈ సందర్బంగా ఆచార్య నుంచి ఆశీర్వాదం అందుకున్నారు.
కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి మోడీ. గత కొన్ని సంవత్సరాలుగా జైనాచార్య ఆధ్వరంలో ఇక్కడ ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు . దీనిని తెలుసుకునేందుకు, వారి సాంగత్యంలో కొంత సమయం గడిపేందుకు సమయం చిక్కడం ఆనందంగా ఉందన్నారు నరేంద్ర దామోదర దాస్ మోడీ.
సామాజిక సేవ, ఆధ్యాత్మికతకు జైనాచార్య రత్న సుందర్సూరీశ్వర్జీ మహరాజ్ సాహెబ్ చేసిన కృషి ప్రశంసనీయం అని పేర్కొన్నారు పీఎం. అతను తన సమృద్ధిగా వ్రాసినందుకు కూడా ప్రశంసించబడ్డాడని తెలిపారు.
భారత దేశపు పుణ్యభూమి అని, ఎందరో మహానుభావులు ఇక్కడ కొలువు తీరారని పేర్కొన్నారు. ఆధ్యాత్మికతకు ఆలవాలం ఈ నేల అంటూ కొనియా డారు నరరేంద్ర దామోదర దాస్ మోడీ.