ట్రినిడాడ్..టొబాగో పీఎంతో మోడీ భేటీ
ఇరు దేశాల మధ్య విస్తృతంగా చర్చలు
ట్రినిడాడ్ – భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు. బ్రెజిల్ లోని రియో డి జెనీరో వేదికగా జరిగిన కీలకమైన జి20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. వివిధ దేశాలకు చెందిన ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులతో భేటీ అయ్యారు.
అక్కడి నుంచి గయానా దేశానికి వెళ్లారు. దేశ అధ్యక్షుడు, ప్రధానమంత్రి ఘనంగా స్వాగతం పలికారు. ఇరు దేశాల మధ్య ఒప్పందాలు చేసుకున్నారు. అనంతరం అక్కడి నుండి నేరుగా ట్రినిడాడ్ , టొబాగోకు వెళ్లారు.
ఆ దేశానికి చెందిన ప్రధాన మంత్రి డాక్టర్ కీత్ రౌలీతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫలవంతమైన సమావేశం జరిగింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను ఎలా విస్తరించాలనే దాని గురించి చర్చించారు.
ప్రధానంగా సైన్స్, హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్, పునరుత్పాదక ఇంధనం, వ్యవసాయం వంటి రంగాలలో సహాయ సహకారాలు అందజేసు కోవాలని నిర్ణయించారు. అంతే కాకుండా ట్రినిడాడ్ , టొబాగో యుపీఐని స్వీకరించడం చాలా సంతోషకరమైన విషయం అని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. వ్యవసాయ, ఆహార ప్రాసెసింగ్‌కు సంబంధించిన అవగాహనా ఒప్పందాలపై సంతకం చేయడం విశేషం.