అసుర కుమారతో మోడీ భేటీ
కీలక అంశాలపై సంతకం
ఢిల్లీ – శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకేతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య జరిగిన చర్చలు వాణిజ్యం, పెట్టుబడులు, అనుసంధానం, ఇంధనం వంటి అంశాలను కవర్ చేశాయి. గృహనిర్మాణం, వ్యవసాయం, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ వంటి రంగాలలో సహకరించు కోవాలని ఒప్పందం చేసుకున్నారు అసుర, మోడీ.
ఇదిలా ఉండగా ఎవరూ ఊహించని రీతిలో తొలిసారిగా శ్రీలంక దేశ చరిత్రలో అసుర కుమార దిస నాయకే సంచలన విజయం సాధించారు . ఆయన కమ్యూనిస్టు భావజాలంతో ముందుకు వచ్చారు. ఇతర దేశాలతో సత్ సంబంధాలు పెంచుకునేందుకు దృష్టి సారిస్తామని పేర్కొన్నారు శ్రీలంక చీఫ్.
ప్రధానంగా శ్రీలంక దేశం పర్యాటక రంగంపై ఎక్కువగా ఆధారపడింది. తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇదిలా ఉండగా తను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జాతిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు అమర కుమార దిస నాయకే.
ప్రధానంగా విద్య, ఆరోగ్యం, ఉపాధి కల్పనపై ఎక్కువగా ఖర్చు చేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా దిస నాయకే భారత్ లో పర్యటించడం కీలకంగా మారింది.