దుబాయిలో ఘన స్వాగతం
యూఏఈ – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యూఏఈలో బిజీగా ఉన్నారు. ఆయన రెండు రోజుల పాటు పర్యటించేందుకు అక్కడికి వెళ్లారు. అపూర్వమైన రీతిలో మోదీకి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడితో కరచాలనం చేసుకున్నారు. ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారు.
ఈ సందర్బంగా భారత దేశం తరపున ఒక ప్రధాన మంత్రి ఇన్నిసార్లు వెళ్లడం ఇదే తొలిసారి. నరేంద్ర మోదీ ఏకంగా ఏడుసార్లు యూఏఈలో పర్యటించారు. ఇది ఓ రికార్డ్ అని చెప్పక తప్పదు. ఈ సందర్బంగా భారత్ , యూఏఈ దేశాల మధ్య సత్ సంబంధాలు కలిగి ఉండేందుకు తాను పర్యటించానని స్పష్టం చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
ప్రపంచ వ్యాప్తంగా తటస్థ వైఖరిని తాము అవలంభిస్తున్నామని స్పష్టం చేశారు నరేంద్ర మోదీ. తాము ఎవరితోనూ యుద్దానికి దిగమని పేర్కొన్నారు. అందరితో కలిసి మెలిసి ఉండాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. యావత్ ప్రపంచంలోని అన్ని దేశాలు కలిసికట్టుగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ.