లోక్ సభలో 20న మోడీ బల నిరూపణ
అదే రోజు లోక్ సభ స్పీకర్ ఎన్నిక
న్యూఢిల్లీ – దేశంలో ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర దామోదర దాస్ మోడీ తనకు అవసరమైన బలం ఉందని నిరూపించు కోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే 72 మంది ఎంపీలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఇదిలా ఉండగా రాజ్యాంగం ప్రకారం 295 మంది సభ్యుల మద్దతుకు సంబంధించి సంతకాలతో కూడిన లేఖను అందజేయాల్సి ఉంటుంది.
వారంతా సభలో ఆసీను కావాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి కసరత్తు పూర్తి చేశారు ఇప్పటికే కేంద్ర హొం శాఖ మంత్రిగా కొలువు తీరిన అమిత్ చంద్ర షా. ఈ మేరకు ఎన్డీయే , బీజేపీ సంకీర్ణ కూటమి జూన్ 20న లోక్ సభలో బల నిరూపణకు సిద్దమైంది.
అదే రోజు లోక్ సభ స్పీకర్ ను ఎన్నుకోనున్నట్లు సమాచారం. కొత్తగా ఎన్నికైన ఎంపీలందరూ జూన్ 18, 19 తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు లోక్ సభలో . జూన్ 21న పార్లమెంట్ ను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. లోక్ సభలో ప్రధాని మోడీ విశ్వాస పరీక్షను ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సర్కార్ అధికారికంగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది.