నామినేషన్ దాఖలు చేసిన మోదీ
చరిత్ర సృష్టించేందుకు సిద్దం
ఉత్తరప్రదేశ్ – దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం యూపీలోని వారణాసి లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. దేశంలోని ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు, ప్రముఖులు ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.
మోదీ నామినేషన్ సందర్బంగా హాజరైన వారిలో టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ , బీజేపీ చీఫ్ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ చంద్ర షా, రాజ్ నాథ్ సింగ్ , యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ , బీహార్ కు చెందిన చిరాగ్ పాశ్వాన్ హాజర్యారు.
వీరితో పాటు అభినందన సంగ్మా , ప్రపుల్ పటేల్ , మరాఠా సీఎం ఏక్ నాథ్ షిండే , రాందాస్ అథవాలే, హర్దీష్ పూరి, జితిన్ రామ్ మాంఝీ, పశుపతి పరాస్ , ఉపేంద్ర కుష్వాహా, సంజయ్ నిషాద్ , జయంత్ చౌదరి, ఓపీ రాజ్ భర్ , అనుప్రియా పటేల్ , అన్షుమణి రామ్ దాస్ , అతుల్ బోరా, ప్రమోద్ బోరో, భూపేంద్ర చౌదరి, దేవ నాథణ్ యాదవ్ . టి, జీకే వాసన్ , తుషార్ వెల్లపల్లి మోదీ వెంట ఉన్నారు. కాగా అజిత్ పవార్ , నితీశ్ కుమార్ ముందస్తు మీటింగ్ ల వల్ల రాలేదు.