వందే భారత్ ట్రైన్ స్టార్ట్
ప్రారంభించిన పీఎం మోదీ
సికింద్రాబాద్ – దేశంలో కొలువు తీరిన మోదీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను. ఇందులో భాగంగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా పట్టాలపై వందే భారత్ ఎక్స్ ప్రైస్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. మంగళవారం రైల్వే శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు నడిచే కొత్తగా ప్రవేశ పెట్టిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ను ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ.
వర్చువల్ గా ప్రారంభించడంతో మరో కొత్త రైలు చేరింది రైల్వే శాఖలో. అత్యాధునిక సదుపాయాలతో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ఏర్పాటు చేసింది. భారీ ఎత్తున ఈ రైళ్లకు ఆదరణ నెలకొంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి, రైల్వే శాఖకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర దామోదర మోదీ. తమ ప్రభుత్వం రైల్వే శాఖా పరంగా కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ప్రయాణీకులకు మేలు చేకూర్చేలా చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ప్రపంచంతో భారత్ పోటీ పడేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.