జి7 సదస్సుకు పీఎం మోడీ
అటెర్రాటోకు చేరుకున్న వైనం
అటెర్రాటో – భారత దేశ ప్రధాన మంత్రిగా కొలువు తీరిన నరేంద్ర దామోదర దాస్ మోడీ చరిత్ర సృష్టించారు. ఆయన ముచ్చటగా మూడోసారి పీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇది ఓ రికార్డ్. గతంలో భారత దేశ 75 ఏళ్ల చరిత్రలో తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత మోడీ కావడం విశేషం. నెహ్రూ కూడా మూడుసార్లు పీఎంగా ఉన్నారు. ఆయన పేరుతో ఉన్న రికార్డును మనోడు చెరిపేశాడు.
ఇది పక్కన పెడితే పీఎంగా కొలువు తీరాక తొలిసారి విదేశీ పర్యటన చేయడం విశేషం. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకమైన జి7 సదస్సుకు విశిష్ట అతిథిగా హాజరయ్యారు మోడీ. అటెర్రాటో ఇన్ ఇటాలియా లో జరిగే ఈ సమావేశానికి ఆయా దేశాలకు చెందిన ప్రధానమంత్రులు, దేశాధ్యక్షులు హాజరయ్యారు.
ఇదిలా ఉండగా అటెర్రాటోకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీకి గ్రాండ్ వెల్ కమ్ లభించింది. ఆయన వారికి అభివాదం చేశారు. ఈ పర్యటనలో భారత దేశానికి సంబంధించిన కీలకమైన అంశాలపై ప్రస్తావించనున్నారు ప్రధానమంత్రి.