దేశం ఆయన త్యాగాన్ని స్మరించుకుంటోంది
ఢిల్లీ – జాతిపిత మహాత్మా గాంధీ చేసిన త్యాగం గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. గాంధీజీ వర్థంతి సందర్బంగా ఢిల్లీలోని రాజ్ ఘాట్ లో సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్, కేంద్ర మంత్రులు. గాంధీ బలిదానం చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుందన్నారు.
మహాత్ముడి ప్రభావం భారత్ పైనే కాదు యావత్ ప్రపంచాన్ని విస్తు పోయేలా చేసిందన్నారు. భారత దేశానికి స్వాతంత్రం తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించారు మహాత్మా గాంధీ. కోట్లాది మంది ప్రజలను మేల్కొల్పారు. శాంతియుతంగా ఉద్యమాన్ని నిర్వహించేలా చేశారు. తనతో పాటు వేలాది మంది కార్యకర్తలను తయారు చేశారు.
చివరకు భారతీయ జనతా పార్టీకి చెందిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కు చెందిన కార్యకర్త నాథురామ్ గాడ్సే చేతిలో కాల్పులకు గురయ్యాడు. దాదాపు 100కు పైగా దేశాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, సామాజిక వేత్తలు, ప్రజా స్వామిక వాదులు, వివిధ రంగాలకు చెందిన వారిని ఇన్ స్పైర్ చేస్తూ వచ్చారు మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ. శాంతి, సామరస్యం, ప్రేమ, సమానత్వం, ప్రజాస్వామ్యం , పరమత సహనం గురించి ప్రస్తావిస్తూ వచ్చారు తన జీవిత కాలమంతా గాంధీ.