ద్వైపాక్షిక సంబంధాలపై ఫోకస్
ఢిల్లీ – అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ కు ఫోన్ చేశారు ప్రధాని మోడీ. రెండోసారి ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య సఖ్యత, ప్రపంచ శాంతి, భద్రతల దృష్ట్యా కలిసికట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు. తనకు అత్యంత ఆత్మీయమైన దేశాధినేతలలో ట్రంప్ ఒకరని పేర్కొన్నారు. ఈ సందర్బంగా మోడీకి ధన్యవాదాలు తెలిపారు ట్రంప్.
ఇదిలా ఉండగా పరస్పర ప్రయోజనకరమైన, విశ్వసనీయ భాగస్వామ్యం కోసం న్యూఢిల్లీ కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా స్పందించారు. నా ప్రియాతి ప్రియమైన స్నేహితుడైన ట్రంప్ మరోసారి అమెరికాకు చీఫ్ గా ఎన్నిక కావడం తనకు మరింత ఆనందాన్ని కలిగించిందని తెలిపారు.
కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ కు తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరు నాయకుల మధ్య జరిగిన మొదటి సంభాషణ ఇది కావడం విశేషం. భారతదేశం యునైటెడ్ స్టేట్స్‌లోకి చట్టబద్ధమైన వలసలకు అతిపెద్ద వనరులలో ఒకటి, కానీ ఇటీవలి సంవత్సరాలలో పదివేల మంది భారతీయులు కెనడియన్ , మెక్సికన్ సరిహద్దులను దాటి దేశంలోకి అక్రమంగా ప్రవేశించారు.
దీనిపై స్పందించారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ . అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న తమ పౌరులను తిరిగి తీసుకోవడానికి భారతదేశం సిద్ధంగా ఉందని అన్నారు.