మన్మోహన్ సింగ్ అరుదైన వ్యక్తి
ప్రశంసించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ – భారత దేశంలో ఎందరో ప్రధానమంత్రులు పని చేశారని కానీ వారిలో ప్రత్యేకమైన వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ అని కొనియాడారు ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. పార్లమెంట్ సాక్షిగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని చెప్పారు.
ఇదిలా ఉండగా డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజ్య సభ సభ్యత్వం ముగిసింది. ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్బంగా పాల్గొని ప్రసంగించారు ప్రధానమంత్రి. అత్యున్నతమైన పదవికి న్యాయం చేకూర్చేందుకు ప్రయత్నం చేశారని కొనియాడారు మోదీ. ఇలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారని పేర్కొన్నారు.
పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ ను అందరూ గౌరవిస్తారని అన్నారు. పార్లమెంట్ కు తన పరిపాలనా దక్షతతో గౌరవం తీసుకు వచ్చారని స్పష్టం చేశారు. ఆర్థిక వేత్తగా దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించిన ఘనత ఒక్క మాజీ ప్రధానమంత్రికి మాత్రమే దక్కుతుందన్నారను నరేంద్ర దామోదర దాస్ మోదీ.
ఆయన నిండు నూరేళ్లు జీవించాలని, ఆయురారోగ్యాలతో , సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.