ఆధునిక భారత దేశ సృష్టికర్త
అద్వానీపై మోదీ ప్రశంసల జల్లు
న్యూఢిల్లీ – భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు , మాజీ ఉప ప్రధాన మంత్రి లాల్ కృష్ణ అద్వానీపై ప్రశంసలు కురిపించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన భారత రత్న అవార్డుతో సత్కరించింది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత రత్నను అందజేశారు ఎల్కే అద్వానీకి.
ఈ సందర్బంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన భారత రత్న అవార్డు కంటే గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. ఈ గౌరవం మన దేశ పురోగమనానికి ఆయన చేసిన శాశ్వత సేవలకు గుర్తింపు దక్కిందన్నారు.
ప్రజా సేవ పట్ల అద్వానీకి ప్రత్యేకమైన అంకితభావం ఉందన్నారు. ఆధునిక భారత దేశాన్ని తీర్చి దిద్దడంలో ఆయన కీలకమైన పాత్ర పోషించారంటూ కితాబు ఇచ్చారు నరేంద్ర మోదీ. భారతీయ చరిత్రలో చెరిగిపోని జ్ఞాపకం ఎల్కే అద్వానీ అని పేర్కొన్నారు పీఎం.
గత కొన్ని దశాబ్దాలుగా ఆయనతో కలిసి పని చేసే భాగ్యం తనకు కలిగినందుకు ఆనందంగా ఉందన్నారు.