ఓం బిర్లాను అభినందించిన మోడీ
ఆనాటి ఎమర్జెన్సీపై షాకింగ్ కామెంట్స్
న్యూఢిల్లీ – దేశంలో చీకటి రోజులు ఏవైనా ఉన్నాయంటే అది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అమలు చేసిన ఎమర్జెన్సీనేనంటూ నూతన స్పీకర్ ఓం బిర్లా లోక్ సభ సాక్షిగా చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ఈ సందర్బంగా ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమి పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ సందర్బంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్పీకర్ ఓం బిర్లాను అభినందనలతో ముంచెత్తారు. స్పీకర్ ఎమర్జెన్సీని తీవ్రంగా ఖండించినందుకు, ఆ సమయంలో చేసిన అతిక్రమాలను ఎత్తిబచూపినందుకు , ప్రజాస్వామ్యం గొంతు నొక్కిన తీరును ప్రస్తావించినందుకు ధన్యవాదాలు తెలిపారు మోడీ. ఆ రోజుల్లో బాధపడ్డ వారందరికీ గౌరవంగా మౌనంగా నిలబడడం కూడా ఒక అద్భుతమైన సంజ్ఞగా పేర్కొన్నారు పీఎం.
50 సంవత్సరాల క్రితం ఎమర్జెన్సీ విధించబడింది, అయితే నేటి యువత దాని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి, ప్రజాభిప్రాయాన్ని అణిచి వేసినప్పుడు , సంస్థలను నాశనం చేసినప్పుడు ఏమి జరుగుతుందో దానికి తగిన ఉదాహరణగా మిగిలి పోయింది. \నియంతృత్వం ఎలా ఉంటుందో ఎమర్జెన్సీ సమయంలో జరిగిన సంఘటనలు ఉదహరించాయంటూ అప్పటి దివంగత పీఎం ప్రధానమంత్రి గురించి ప్రస్తావించారు.