ప్రశంసించిన ప్రధానమంత్రి
న్యూఢిల్లీ – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన పద్మశ్రీ బిరుదు పొందిన డాక్టర్ పరశురామ్ కోమాజీ ఖునేని ప్రత్యేకంగా ప్రస్తావించారు. తనను కలుసుకున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు మోదీ. మంగళవారం ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన సేవల గురించి గుర్తు చేశారు మోదీ.
గిరిజన వర్గాల అభ్యున్నతి కోసం నాటకం, జానపద కళల ద్వారా లక్షలాది మంది ప్రజలను ప్రభావితం చేస్తూ వచ్చారని పరశురామ్ కోమాజీ ఖునేని గురించి తెలిపారు ప్రధానమంత్రి. కళలను ప్రభావితం చేసిన ఆయన విశేషమైన పని అతడికి విస్తృత గౌరవాన్ని తీసుకు వచ్చేలా చేసిందని అన్నారు మోదీ.
పరశురామ్ చేసిన ప్రయత్నాలు సంస్కృతిని పెంపొందించేందుకు , సామాజిక అవగాహనను ప్రోత్సహించేందుకు సహాయ పడిందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తనను కలుసుకుని కంగ్రాట్స్ తెలిపినందుకు పరశురామ్ ప్రధాన మంత్రి మోదీకి ధన్యవాదాలు తెలిపారు.