ప్రధానమంత్రి నరేంద్ర దాస్ మోదీ
న్యూఢిల్లీ – భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడంలో పదాధికారుల పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. ఢిల్లీలో జరిగిన బీజేపీ పదాధికారుల ప్రత్యేక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
మన పార్టీకి ముఖ్యంగా మనందరికీ త్వరలో దేశంలో జరిగే పార్లమెంట్ ఎన్నికలు అత్యంత కీలకమైనవని గుర్తు పెట్టుకోవాలని స్పష్టం చేశారు. ఏ ఒక్కరు ఏమరుపాటుగా ఉండ కూడదని సూచించారు. గెలిచామన్న ధీమాను ఎక్కడా వ్యక్తం చేయొద్దని , మనం పాలకులం కామని కేవలం ప్రజలకు సేవకులం మాత్రమేనన్న అంశాన్ని ప్రధానంగా ముందుకు తీసుకు వెళ్లాలని స్పష్టం చేశారు నరేంద్ర మోదీ .
ఈ సందర్భంగా బీజేపీ బలోపేతం కావడంలో అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నది మనం కాదని కార్యకర్తలేనని గుర్తించాలని పేర్కొన్నారు ప్రధాన మంత్రి. వారికి ఏం కావాలో , ఏం చేయాలని అనుకుంటున్నారనే విషయంపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలని చెప్పారు మోదీ. మన లక్ష్యం ఒక్కటే 400 సీట్లు కైవసం చేసుకోవడమేనని పేర్కొన్నారు.