NEWSNATIONAL

ప‌వ‌న్ ప‌వ‌ర్ ఉన్నోడు – మోడీ

Share it with your family & friends

న‌టుడికి ప్ర‌ధాన‌మంత్రి కితాబు

న్యూఢిల్లీ – ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోడీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం న్యూఢిల్లీలో ఎన్డీయే – భార‌తీయ జ‌న‌తా పార్టీ కీల‌క స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా న‌రంద్ర మోడీని ఏకగ్రీవంగా త‌మ నాయ‌కుడిగా ఎన్నుకున్నారు.

ఈనెల 9వ తేదీన బుధ‌వారం మూడోవ ప్ర‌ధాన‌మంత్రిగా కొలువు తీర‌నున్నారు మోడీ. తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు తో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ , నితీశ్ కుమార్ హాజ‌ర‌య్యారు. పూర్తి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ప్ర‌ధానిగా చ‌రిత్ర సృష్టించ బోతున్నారు. ఈ సంద‌ర్బంగా న‌రేంద్ర మోడీ ప్ర‌సంగించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఆయ‌న గాలి మామూలు గాలి కాద‌న్నారు. తుఫాను లాగా ఫ‌లితాల‌లో విధ్వంసం సృష్టించాడంటూ పేర్కొన్నారు.

ఏపీలో మొత్తం 21 అసెంబ్లీ స్థానాల‌తో పాటు 2 లోక్ స‌భ స్థానాల‌ను జ‌న‌సేన పార్టీ విజ‌యం సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడంటూ కొనియాడారు. ఒక ర‌కంగా చెప్పాలంటే వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు.