రష్మిక జోష్ మోదీ ఖుష్
ముంబై వంతెనపై స్పందన
న్యూఢిల్లీ – సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించుకునే వారిలో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆయన దేనిని వదిలి పెట్టరు. ప్రతి దాని పట్ల ఆసక్తిని కనబరుస్తారు. దాని గురించి తెలియ చేస్తారు. అంతే కాదు దేశానికి సంబంధించి ఎవరు విజయం సాధించినా వారిని పరిచయం చేస్తారు. అభినందనలతో ముంచెత్తుతారు.
తాజాగా నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందిన ప్రముఖ నటి రష్మిక మందన్నా వైరల్ గా మారారు. దీనికి కారణం ఆమె తాజాగా ముంబై వేదికగా చేసిన వీడియో సెన్సేషన్ గా మారింది. నగరంలో నిర్మించిన అటల్ బిహారీ వాజ్ పేయి ట్రాన్స్ హార్బర్ లింగ్ వంతెనకు సంబంధించినది ఇది.
దీనికి పేరు కూడా పెట్టారు అటల్ సేతు అని. భారత దేశంలో ప్రధానంగా సముద్రంపై నిర్మించిన అతి పెద్ద వంతెన ఇది. ఈ బ్రిడ్జిని ఆరు లేన్లతో నిర్మించారు. మొత్తం 22 కిలోమీటర్లు. ముంబై లోని సేవ్రీ నుంచి నౌవాను ప్రాంతాలను కనెక్ట్ చేస్తూ దీనిని కేంద్ర సర్కార్ 7 ఏళ్లలో నిర్మించింది.
రష్మిక అద్భుతం అంటూ వీడియో చేయడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుల్ ఖుష్ అయ్యారు. ఆయన రష్మిక వీడియోను షేర్ చేస్తూ ప్రజలను కలపడం ఇంతకంటే అదృష్టం ఇంకేం ఉంటుందని పేర్కొన్నారు.