రైజింగ్ రాజస్థాన్ ప్రశంసనీయం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
రాజస్థాన్ – దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం రాజస్థాన్ లో పర్యటించారు. ఈ సందర్బంగా బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కీలక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్టాళ్లను పరిశీలించారు. యాక్షన్ ప్లాన్ గురించి పీఎంకు వివరించారు.
ఇన్నోవేషన్, గ్రోత్ , ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోసం రాజస్థాన్ ఎలా హబ్‌గా ఎదుగుతోందో చూపించడం అభినందనీయమని పేర్కొన్నారు నరేంద్ర మోడీ. రైజింగ్ రాజస్థాన్ ప్రశంసనీయమైన ప్రయత్నం అని స్పష్టం చేశారు పీఎం. గొప్ప వారసత్వం, ఎంటర్‌ప్రైజ్ సంస్కృతి, ప్రగతిశీల విధానాలతో నడిచే రాజస్థాన్ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తోందని చెప్పారు మోడీ.
అభివృద్దియే నినాదంతో తాము ముందుకు వెళుతున్నామని, ప్రజలు తమనే కోరుకుంటున్నారని అన్నారు పీఎం. అన్ని రంగాలలో రాజస్థాన్ దేశానికే ఆదర్శ ప్రాయంగా మారేందుకు అవకాశాలు చాలా ఉన్నాయని పేర్కొన్నారు.