తమిళులది ఘనమైన వారసత్వం
స్పష్టం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
తమిళనాడు – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాష్ట్రానికి ఘనమైన చరిత్ర ఉందన్నారు. ఆయన తమిళనాడు జాతీయ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
ఈ సందర్బంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు తమిళుల గురించి. తాను ప్రధానమంత్రిగా కొలువు తీరిన తర్వాత ఈ దేశ చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేశానని చెప్పారు మోదీ. ఇందులో భాగంగా తాను విస్తు పోయేలా చేసింది ఒక్క తమిళనాడు మాత్రమేనని పేర్కొన్నారు.
తమిళులకు ఆత్మాభిమానం ఎక్కువని, అంతకు మించి భాషాభిమానం, ప్రాంతీయ అభిమానం మెండుగా ఉంటుందన్నారు. రామనాథపురం అనే పేరు కలిగిన ఊర్లు చాలా ఉన్నాయని, ఇది తాను తెలుసుకున్నానని తెలిపారు ప్రధానమంత్రి.
అయితే యూపీలోని అయోధ్యలోని రామ మందిరం చుట్టూ ఇలాంటి పేర్లు కలిగిన ఊర్లు లేవన్నారు. విచిత్రం ఏమిటంటే తమిళుల వారసత్వం గురించి వారికే తెలియక పోవడం బాధాకరమని పేర్కొన్నారు నరేంద్ర మోదీ.