SPORTS

మీ విజ‌యం దేశానికి గౌర‌వం

Share it with your family & friends

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ

న్యూఢిల్లీ – ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గురువారం టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌గా నిలిచిన భార‌త క్రికెట్ జ‌ట్టు ప్ర‌ధానిని ప్ర‌త్యేకంగా త‌న నివాసంలో క‌లుసుకుంది. విశ్వ విజేత‌గా నిలిచిన టీమిండియాను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు ప్ర‌ధాన‌మంత్రి.

పేరు పేరునా ప్ర‌తి ఒక్క క్రికెట‌ర్ ను ఆప్యాయంగా ప‌ల‌క‌రించారు. వారి అనుభ‌వాల‌ను ఆయ‌న అడిగి తెలుసుకున్నారు. ప్ర‌త్యేకించి ప్ర‌ధాన‌మంత్రి భార‌త జ‌ట్టు విజ‌యానికి మార్గ నిర్దేశ‌నం చేసిన జ‌ట్టు హెడ్ కోచ్ , భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్, ది వాల్ గా పేరు పొందిన రాహుల్ ద్ర‌విడ్ ను అభినందించారు. మీ స్పూర్తి వేలాది మందికి స్పూర్తిగా నిలుస్తుంద‌న్నారు.

క‌ష్ట స‌మ‌యంలో ఎలా ఓర్పుతో నెగ్గుకు రావాలో నేర్పిన తీరు త‌న‌ను విస్తు పోయేలా చేసింద‌న్నారు. చివ‌రి వ‌ర‌కు ఎక్క‌డా తొట్రుపాటుకు లోను కాకుండా విజ‌యం సాధించేంత దాకా విశ్ర‌మించ‌కుండా సాగించిన పోరాటం అద్భుత‌మ‌న్నారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోడీ.

బీసీసీఐ బాస్ రోజ‌ర్ బిన్నీ, కార్య‌ద‌ర్శి జే షా , కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, క్రికెట‌ర్ల‌తో త‌న అనుభ‌వాల‌ను పంచుకున్నారు. భార‌త ప్ర‌భుత్వం ఎప్ప‌టికీ గుర్తు పెట్టుకుంటుంద‌ని, దేశం గ‌ర్వ ప‌డేలా చేశారంటూ పేర్కొన్నారు.