దేశ భవిష్యత్తు యువత పైనే
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మెట్రోలో ప్రయాణం చేయడం మరిచి పోలేనని పేర్కొన్నారు. ఈ దేశ భవిష్యత్తు యువతపై ఉందని తెలిపారు. ఈ ప్రాజెక్టును విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన వారందరినీ ప్రత్యేకంగా పేరు పేరునా అభినందిస్తున్నట్లు స్పష్టం చేశారు ప్రధానమంత్రి.
మెట్రో ప్రయాణం అనేది ప్రతి ఒక్కరికీ అద్భుతమైన ఆనందం ఇస్తుందని తెలిపారు. అంతే కాదు హుగ్లీ నది కింద ఉన్న సొరంగం ద్వారా జర్నీ చేయడం అనేది తన జీవితంలో ప్రత్యేకంగా గుర్తుండి పోతుందన్నారు.
ఇవాళ దేశంలో ప్రయాణీకులను చేరవేస్తున్న సంస్థలలో రైల్వే శాఖ కీలకమైన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. లక్షలాది మంది ప్రతి రోజూ తమ తమ ప్రాంతాలకు వెళుతున్నారని తెలిపారు. తాము వచ్చాక కీలకమైన మార్పులు తీసుకు వచ్చినట్లు వెల్లడించారు ప్రధానమంత్రి మోదీ.
వందే భారత్ ట్రైన్స్ ను తీసుకు రావడం జరిగిందన్నారు. ప్రస్తుతం ప్రయాణీకులకు మరిచి పోలేని జ్ఞాపకాలను మిగిల్చేలా ఇవి ఇస్తున్నాయని తెలిపారు ప్రధానమంత్రి.