NEWSNATIONAL

ఎన్నిక‌ల ప్ర‌చారంలో మోడీ రికార్డ్

Share it with your family & friends

206 ర్యాలీలు..రోడ్ షోలు..స‌భ‌లు

న్యూఢిల్లీ – దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోడీ చ‌రిత్ర సృష్టించారు. ఇప్ప‌టికే ఆయ‌న అరుదైన నాయ‌కుడిగా, స‌మ‌ర్థ‌వంత‌మైన నేత‌గా , ప‌రిణ‌తి చెందిన వ్య‌క్తిగా గుర్తింపు పొందారు ప్ర‌ధాని. తాజాగా ఆయ‌న చ‌ర్చ‌నీయాంశంగా మారారు. దీనికి కార‌ణం ఏమిటంటే దేశ వ్యాప్తంగా 17వ విడ‌త పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. మొత్తం ఏడు విడ‌త‌లుగా తొలిసారిగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్వ‌హించింది. ఇది కూడా ఓ రికార్డే.

ఇదిలా ఉండ‌గా భార‌తీయ జ‌న‌తా పార్టీతో పాటు అనుబంధ సంస్థ‌ల‌న్నీ గంప గుత్త‌గా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీని స్టార్ క్యాంపెయినర్ గా ముందు పెట్టింది. భారీ ఎత్తున ప్ర‌చారం చేప‌ట్టేలా చేసింది. ఈసారి ఎన్నిక‌ల్లో 400 సీట్ల‌కు పైగా రావాల‌నే ల‌క్ష్యంతో ప‌నిచేసింది.

ఇందులో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ దేశమంత‌టా \సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో స‌రికొత్త చ‌రిత్ర‌కు నాంది పలికారు. ఆయ‌న మొత్తం 206 ర్యాలీలు, రోడ్ షోలు, బ‌హిరంగ స‌భ‌లు, కార్య‌క్ర‌మాల‌లో పాల్గొని ప్ర‌సంగించారు. అంతే కాకుండా వివిధ రాష్ట్ర , జాతీయ స్థాయిలో పేరు పొందిన ఛాన‌ళ్ల‌కు 86 ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు.