ప్రధానమంత్రి మోడీ రాజీనామా
మంత్రులు కూడా రాజీనామా
న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు వెల్లడి అయ్యాయి. ఈ సందర్బంగా కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గాను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి బుధవారం న్యూఢిల్లీలో అత్యవసర సమావేశం జరగనుంది.
ఇందులో భాగంగా రాజ్యాంగం ప్రకారం కొత్తగా కొలువు తీరేందుకు గాను ఇప్పటి వరకు ప్రభుత్వంలో కొనసాగుతున్న మోడీ సర్కార్ పూర్తిగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా రాష్ట్రపతి భవన్ కు వెళ్లారు. అక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో చాలా సేపు సంభాషించారు. అనంతరం తనతో పాటు మంత్రివర్గం మొత్తం రాజీనామా చేసిన విషయాన్ని వెల్లడించారు.
ఈ మేరకు రాజీనామా పత్రాలను రాష్ట్రపతికి అందజేశారు. దీంతో ప్రధాని రాజీనామాను, మంత్రి మండలి సమర్పించిన పత్రాన్ని ఆమోదించారు ద్రౌపది ముర్ము. కాగా కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు తమ పదవులలో కొనసాగాలని ప్రధానమంత్రి, ఆయన సహచరులను అభ్యర్థించారు రాష్ట్రపతి.