మంత్రులకు మోడీ దిశా నిర్దేశం
పాలనా పరంగా జాగ్రత్తగా ఉండాలి
న్యూఢిల్లీ – దేశ ప్రధానమంత్రిగా ముచ్చటగా మూడోసారి కొలువు తీరిన నరేంద్ర దామోదర దాస్ మోడీ ఇవాళ నూతన కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ కీలక సమావేశంలో పాల్గొన్న మంత్రులకు ప్రధానమంత్రి దిశా నిర్దేశం చేశారు.
మంత్రి వర్గంలో చేరడాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. ఇదే సమయంలో కీలకమైన ఈ పదవులలో ఉన్న వారు తమ తమ శాఖలపై అవగాహన పెంచు కోవాలని సూచించారు. లేక పోతే ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు నీళ్లు నమిలే పరిస్థతి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి మండలిలో ఉన్న ప్రతి ఒక్కరు కింది స్థాయిలో పాలనను మరింత పటిష్టం చేసే మార్గాలపై ఫోకస్ పెట్టాలని స్పష్టం చేశారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.