పురోభివృద్ధికి ఏఐ కీలకం
స్పష్టం చేసిన ప్రధాని మోడీ
ఇటలీ – భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. యావత్ ప్రపంచం ఇప్పుడు సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు. ఇటలీలో జరిగిన జి7 శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా సాంకేతిక రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులను ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , మెషీన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, తదితర రంగాలన్నీ దూసుకు పోతున్నాయని వాటిని గుర్తించి మానవ , సమాజ పురోభివృద్దికి ఎలా వాడుకోవాలని ఆయా దేశాల ప్రతినిధులు, అధినేతలు, పీఎంలు, ప్రెసిడెంట్లు ఆలోచించాలని స్పష్టం చేశారు నరేంద్ర దామోదర దాస్ మోడీ.
ప్రతి రంగంలో ఏఐ అన్నది కీలకం కానుందని దీనిపై ఎక్కువగా దృష్టి సారించాలని సూచించారు ప్రధానమంత్రి. ఇదే సమయంలో తాము డిజిటల్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు.